శిక్షణలో విషాదం, బాలిక భుజంలో దిగిపోయిన బాణం…!

-

ఈశాన్య రాష్ట్రమైన అసోంలో విషాద సంఘటన జరిగింది. అసోంకు చెందిన 12 ఏళ్ళ ఆర్చర్ శివంగిని గోహైన్ కొన్నాళ్ళుగా ఆర్చరీలో శిక్షణ పొందుతుంది. అస్సాంలోని దిబృగర్ జిల్లాలోని చబువాలో ఆమె శిక్షణ తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె శిక్షణా సమయంలో బాణం ప్రమాదవ శాత్తు భుజంలోకి గుచ్చుకుంది. దీనితో వెంటనే బాలికను అక్కడ ఉన్న అధికారులు మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ తరలించారు

ఆర్చర్‌కు ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఒక స్పోర్ట్స్ డాక్టర్ చికిత్స అందిస్తున్నారని, ఆమె చికిత్సకు అయ్యే ఖర్చులన్నింటినీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) భరిస్తోందని అధికారులు తెలిపారు. ఎస్‌ఐఐలో శిక్షణ పొందిన శివంగిని గోహైన్ ఖెలో ఇండియా గేమ్స్‌లో పాల్గొనలేదు, ఆ గేమ్స్ శుక్రవారం గువహతిలో ప్రారంభం కానున్నాయి. ఈ ఘటనపై మాట్లాడిన క్రీడా కార్యదర్శి ఆర్ఎస్ జులానియా,

“దిబృగర్ లో ప్రమాదానికి గురైన ఆర్చర్‌ను ఢిల్లీకి తరలించారు. విమాన ప్రయాణంతో సహా ఆమె చికిత్సకు అయ్యే ఖర్చులన్నింటినీ ఎస్‌ఐ భరిస్తుంది మరియు ఒక సీనియర్ ఎస్‌ఐఐ అధికారిని ఆసుపత్రిలో ఆమెకు మెరుగైన చికిత్స అందించడానికి పంపించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఆమెకు ఆపరేషన్ అవసరమని వైద్యులు చెప్పినట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news