కండక్టర్లకు డ్రైవర్లకు జగన్ గుడ్ న్యూస్…!

-

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసిన ముఖ్యమంత్రి జగన్, ఆర్టీసి డ్రైవర్లకు మరో శుభవార్త అందించారు. ఇక నుంచి 8గంటలకుపైగా విధులను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తుంది. డ్రైవర్లకు సరైన విశ్రాంతి లేకుండా బస్సులు నడపటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన ఉన్నతాధికారులు, డ్రైవర్లు అదనంగా విధులు నిర్వహిస్తామని అంగీకరిస్తేనే అనునమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ఆర్టీసీ ఎండీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల నుంచి దూర ప్రాంతాలకు అంటే దాదాపు 600కిలోమీటర్లకు పైగా బస్సులు వెళ్ళడంతో డ్రైవర్లు ఎక్కువగా విధుల్లో ఉండటం జరుగుతుంది. దీనితో జిల్లా కేంద్రాలతోపాటూ ముఖ్యమైన నగరాల వరకే బస్సులు నడపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఇక కండక్టర్ల విషయానికి వస్తే, ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఉన్నత విద్యావంతులు వారిలో ఉంటే, వారిని డిప్యుటేషన్ పై ఇతర శాఖల్లోకి పంపే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. కార్మిక సంఘాలను ఉద్యోగ సంఘాలుగా మార్చాలని భావిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సంక్రాంతి రద్దీ దృష్ట్యా అదనపు బస్సులను నడపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. డ్రైవర్ల కొరత ఉంటే బయట నుంచి తీసుకోవాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news