జానీ మాస్టర్ కు భారీ ఊరట లభించింది. జానీ మాస్టర్ కు తాజాగా బెయిల్ మంజూరు అయింది. జాని మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. ఈ నెల 6 నుంచి 10 వ తేది వరకు బెయిల్ జాని మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్ కు బెయిల్ చేశారు.
దీంతో ఈ నెల 6వ తేదీన జానీ మాస్టర్ రిలీజ్ కానున్నారు. ఇది ఇలా ఉండగా…టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ యువతి పై అత్యాచారానికి పాల్పడ్డాడని ఇటీవల నార్సింగి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో గోవాలో దాక్కున్న జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. జైలులో ఉండగానే పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలని ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు కస్టడీకి పోలీసులకు అనుమతినిచ్చింది.