Nagarjuna met Mizoram Governor Haribabu in Vizag: తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దూమారం రేపుతున్న సందర్భంగా గవర్నర్ నున కలిసారు అక్కినేనా నాగార్జున. అయితే.. తెలంగాణ గవర్నర్ కాకుండా.. మిజోరాం గవర్నర్ ను కలిసారు అక్కినేనా నాగార్జున. ఇవాళ వైజాగ్ లో మిజోరాం గవర్నర్ హరిబాబుని కలిశారు నాగార్జున.

ఇటీవలే అనారోగ్యానికి గురైన హరిబాబుని కలిసి పరామర్శించారు నాగార్జున. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తో కలిసి పరామర్శించిన నాగార్జున….కొండా సురేఖ వ్యాఖ్యలపై మాట్లాడటానికి నిరాకరించారు. ఇక అటు సమంతపై వ్యాఖ్యలు అనుకోకుండా చేసినవి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి కొండా సురేఖ. సమంత ట్వీట్ చూసి నేను చాలా బాధపడ్డాననన్నారు మంత్రి కొండా సురేఖ. నాకు జరిగిన అవమానం వేరొకరికి జరగకూడదనే.. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అంటూ క్లారిటీ ఇచ్చారు. కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కేటీఆరే నాకు క్షమాపణ చెప్పాలి.. కేటీఆర్ వేసే పరువు నష్టం దావాను లీగల్‌గానే ఎదుర్కొంటానని ప్రకటించారు మంత్రి కొండా సురేఖ.