తిరుమల లడ్డూ వివాదం పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

-

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం గత కొద్ది రోజుల నుంచి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా శ్రీవారి లడ్డు వివాదం పై మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తో పాటు పాలురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ గవాహి జస్టిస్ విశ్వనాథ్ విచారించింది. లడ్డు వివాదం పై దర్యాప్తునకు సంబంధించి కేంద్రం వైఖరి చెప్పాలని సోలి సీటర్ జనరల్ తుషార్ మెహతాను విజ్ఞప్తి చేసింది. దీంతో తమ అభిప్రాయం తెలిపేందుకు సోలిసిటర్ జనరల్ సమయం కోరారు.

గత విచారణలో ఏపీ ప్రభుత్వం టిటిడి పై సుప్రీంకోర్టు మండిపడిన విషయం తెలిసిందే.  ఆధారాలు లేకుండా లడ్డు ప్రసాదం పై వ్యాఖ్యలు చేయడం కోట్లాదిమంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమలలో రాజకీయాల్లోకి లాగొద్దంటూ సీరియస్ అయింది. వాస్తవానికి నిన్ననే విచారణ జరగాల్సి ఉండగా.. సొలిసిటర్ జనరల్ తుషార్ అభ్యర్థన మేరకు ఇవాళ ఉదయం 10.30 గంటలకు వాదలను వింటామని ధర్మాసనం తెలిపింది. సిట్ దర్యాప్తును కొనసాగించాా..? లేదా స్వతంత్ర సంస్థలకు అప్పగించాలా..? అనేది ఇవాళ న్యాయమూర్తులు తేల్చనున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news