దాండియా వేడుకలకు వారిని రానివ్వొద్దు : రాజాసింగ్

-

దసరా ఉత్సవాల్లో భాగంగా తెలంగాణలో కొందరు ఆర్గనైజర్లు దాండియా ఈవెంట్లను నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల స్వచ్ఛందంగా ప్రజలే వారి సంప్రదాయాలు, సంస్కృతిని ఇనుమడింపజేసేలా వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే దాండియా వేడుకలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ra

దాండియా వంటి సంప్రదాయాల వేడుకలకు బొట్టు లేకుండా వచ్చే వారికి అనుమతి ఇవ్వకూడదని నిర్వాహకులకు సూచించారు.దాండియా కార్యక్రమాల్లో హిందూ అమ్మాయిలు ఎక్కువగా పాల్గొంటారని, ఇతర మతానికి చెందిన వ్యక్తులు లవ్ జిహాద్ పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ వేధింపులకు గురి చేస్తున్నారని సూచించారు.అందుకే దాండియా వేడుకలకు అనుమతి ఇచ్చే ముందు తప్పనిసరిగా సరైన పత్రాలు పరిశీలించాలని, లోపలికి వెళ్ళాక దుర్గాదేవిని దర్శించుకుని,నుదుటిపై తిలకం ధరించిన వారినే దాండియాకు అనుమతి ఇవ్వాలన్నారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే బహిష్కించాలని డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news