రాను రాను జనాలు ఎలా తయారుతున్నారంటే ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన పనిలేదని.. తమకు నచ్చినట్లు తాము ఉంటానని..తప్పు చేసినప్పుడు ఎవరైనా ప్రశ్నిస్తే ఏకంగా వారిపైనే దాడులకు తెగబడేలా తయారువుతున్నారు.మంచిని పంచకపోయినా పర్వాలేదు.కానీ, వారి చేసే చెడును అడ్డుకున్నందుకు కూడా ఎదుటివారిపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
రోడ్డు పక్కన మూత్రం పోయొద్దని చెప్పినందుకు గాను పడుకున్న ఓ వ్యక్తిని లేపి మరీ ఓ యువకుడు కర్రతో దాడి చేశాడు. ఈ షాకింగ్ ఘటన నార్త్ ఢిల్లీలో జరిగింది. రామ్ ఫల్ అనే వ్యక్తి షాపులో పనిచేస్తున్నాడు. అక్కడికి సమీపంలో ఒక పార్కు ఉంది. ఆ పార్కు వద్ద ఆర్యన్ అనే యువకుడు మూత్రం పోస్తుండగా.. రామ్ అనే వ్యక్తి మందలించాడు. అది మనసులో పెట్టుకున్న ఆర్యన్ మరుసటి రోజు రామ్‌ను కర్రతో చితకబాదాడు.ఈ దృశ్యాలు స్థానిక షాపులోని సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ కావడంతో పోలీసులు ఆర్యన్‌ను అరెస్టు చేయగా.. నిందితుడు బెయిల్ మీద విడుదలయ్యాడు.