ఎవరు అడ్డం వచ్చినా మూసి రివర్ ఫ్రంట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం : సీఎం రేవంత్

-

38 వేల కోట్లతో ప్రారంభమైన ప్రాణహిత చేవెల్ల రీ డిజైన్ పేరుతో లక్ష కోట్లకు పెరిగి కాలేశ్వరం గా మారింది. మల్లన్న సాగర్ కట్టిన ప్రాంతంలో ఇంజనీరింగ్ నిపుణులు హెచ్చరించారు అని సీఎం రేవంత్ అన్నారు. 50 టీఎంసీల నీళ్లు నింపినప్పుడు ఆ భూమిపరలో చీలికలు వస్తాయని చెప్పారు. భూకంపం వచ్చి కృంగిపోయి ఊర్లకు ఊర్లు మునిగిపోతాయని సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. కేసీఆర్ కుటుంబంలో వినోద్ కవిత ఓడిపోతే వెంటనే ఒకరికి ఎమ్మెల్సీ.. ఇంకొకరికి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ చేశారు కేసీఆర్.

కేసీఆర్ పిల్లలు రోడ్లమీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరు అడ్డం వచ్చినా మూసి రివర్ ఫ్రంట్ నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. మల్లన్న సాగర్లో 14 గ్రామాలు ముంచలేదా.. మల్లన్న సాగర్ రైతులను గుర్రాలు పెట్టి తొక్కించింది నువ్వు. కానీ మూసి పేదలని అక్కున చేర్చుకుంటుంది నేను. ఇవాళ నేను ఢిల్లీకి పోతున్న.. నువ్వు కూడా రా ఈటెల మోడీని కలిసి డబ్బులు అడుగుదాం అని సీఎం రేవంత్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news