మూసీ పేరుతో లక్ష యాభై వేల కోట్ల సోకులు ఎవరికోసం? – కేటీఆర్‌

-

మూసీ పేరుతో లక్ష యాభై వేల కోట్ల సోకులు ఎవరికోసం? అంటూ కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలె అన్నట్టునది రేవంత్ వైఖరి ఉందని చురకలు అంటించారు. తెల్లారి లేస్తే బీద అరుపులు. రాష్ట్రం అప్పులపాలైంది అని, డబ్బులు లేవని… మరొకవైపు మూసి పేరిట ఈ లక్ష యాభై వేల కోట్ల సోకులు, ఆర్భాటం ఎవరికోసం? అంటూ నిలదీశారు.

రేవంత్‌ సీఎం అయ్యాక…. రైతు రుణమాఫీకి డబ్బులు లేవు… రైతుబంధుకి డబ్బులు లేవు…రైతు కూలీలకు డబ్బులు లేవు అన్నారు. కౌలు రైతులకు డబ్బులు లేవు, నిరుద్యోగ భృతికి డబ్బులు లేవు… పేదవాళ్లకు పెన్షన్లకు డబ్బులు లేవు అంటూ ఫైర్ అయ్యారు. మహిళలకు మహాలక్ష్మి పథకం అమలుకు డబ్బులు లేవు…ఆడపిల్లలకు స్కూటీలకు డబ్బులు లేవని తెలిపారు. ఉద్యోగస్తులకు DAలకు డబ్బులు లేవు… మునిసిపాలిటీలలో పారిశుధ్య కార్మికులకు జీతాలకు డబ్బులు లేవు అంటూ విమర్శలు చేశారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news