ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖాతాలో `దేవర` రూపంలో మరో హిట్ వచ్చి పడింది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అయిన దేవర.. మిక్స్డ్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద మాస్ రచ్చ చేస్తోంది. వారం తిరగక ముందే బ్రేక్ ఈవెన్ అయింది దేవర.. ప్రస్తుతం భారీ లాభాలతో రూ. 400 కోట్ల క్లబ్ లో చేరింది.
ప్రస్తుతం దసరా పండుగ సెలవులు కావడంతో కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమాకి 10 రోజుల్లో రూ.466 కోట్లు వచ్చినట్టు మేకర్స్ ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ శుక్రవారం కొత్త సినిమాలు విడుదల కానుండటంతో థియేటర్లు తగ్గే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి దేవర టార్గెట్ ని రీచ్ అయి లాభాల బాటలో పట్టింది. మొత్తం ఫుల్ రన్ పూర్తయ్యే సరికి ఎన్నికోట్ల లాభం వస్తుందో వేచి చూడాలి మరీ.