ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రధానంగా చైర్మన్, వైస్ చైర్మన్ లు గా జనసేన బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడం విశేషం. మందస్తు ఒప్పందం ప్రకారం.. చైర్మన్ జనసేనకు, వైస్ చైర్మన్ టిడిపి కి కేటాయింపు చేసుకున్నారు. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థి జనసేనకు మద్దతు ఇవ్వడంతో సమీకరణాలు అన్ని మారిపోయాయి.
ఇక టిడిపి అభ్యర్థి పై ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించాడు. దీంతో పొత్తు ధర్మం పాటించలేదని అందుకే ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచాడని టిడిపి ఆరోపణలు చేసింది. తాము పోటీ చేసిన రెండో వార్డులో టీడీపీ రెబల్ ను ఎందుకు ఎంకరేజ్ చేశారని ప్రశ్నిస్తోంది జనసేన. ఇండిపెండెంట్ గా గెలిచిన డైరెక్టర్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు అనుచరుడు కావడం గమనార్హం.