జమ్మూ కాశ్నీర్ ఫలితాలు.. గవర్నర్ అధికారం పై వివాదం..!

-

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఐదుగురు సభ్యులను నామినేట్ చేసే ప్రత్యేక అధికారం లెఫ్టినెంట్ గవర్నర్ కు ఇవ్వడం పై పెద్ద ఎత్తున వివాదం రేగుతుంది. డీలిమిటేషన్ తర్వాత, జమ్మూ ప్రాంతంలో అసెంబ్లీ స్థానాలు సంఖ్య 43 కాగా, కాశ్మీర్ లోయలో అసెంబ్లీ స్థానాలు సంఖ్య 47. డీలిమిటేషన్ తర్వాత మొత్తం 90 అసెంబ్లీ స్థానాలే కాకుండా, అదనంగా గవర్నర్ మరో ఐదుగురు సభ్యులను నామినేట్ చేసే అధికారాలు సంక్రమించాయి.

ఐదుగురు నామినేటేడ్ సభ్యుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు కాశ్మీరి పండిట్ లు, “పాక్ ఆక్రమిత కాశ్మీర్” నుంచి ఒకరికి అవకాశం వస్తుంది. దీంతో 90 నుంచి 95 కి పెరిగింది అసెంబ్లీ సభ్యుల సంఖ్య. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన “మ్యాజిక్ ఫిగర్” కూడా 46 నుంచి 48 కి చేరింది. ఈ క్రమంలో లెఫ్ననెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఐదుగురు సభ్యులను నామినేట్ చేయడం, బిజేపి కి సహకరించేందుకేనని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి “నేషనల్ కాన్ఫరెన్స్”, పిడిపి, కాంగ్రెస్ పార్టీలు. ఇలాంటి ఏ ప్రయత్నమైనా ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడమే, కించపరచడమే నని విమర్శించాయ్ “ఇండియా” కూటమి పార్టీలు. ఎన్నికైన అసెంబ్లీ సభ్యులకు ఉన్న అధికారాలు, ఆ ఐదుగురు సభ్యులకు కూడా పూర్తి స్థాయి అధికారాలుంటాయు. దీంతో ఈ విషయంలో సుప్రీం కోర్టు ను ఆశ్రయుస్తామని చెప్పారు “నేషనల్ కాన్ఫరెన్స్” అగ్రనేత ఫరూఖ్ అబ్దుల్లా

Read more RELATED
Recommended to you

Latest news