Ind vs Ban: నేడు రెండో టీ20..బంగ్లాను చిత్తు చేసేందుకు టీమిండియా రెడీ

-

India vs Bangladesh, 2nd T20I: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య ఇవాళ రెండవ టి20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే మొదటి టీ20 మ్యాచ్ గెలిచిన టీం ఇండియా ఫుల్ కాన్ఫిడెన్స్ తో రెండో టి20కి రెడీ అవుతుంది. ఇందులో కూడా విజయం సాధించి సిరీస్ ఎగుర వేసుకొని పోవాలని ప్లాన్ వేస్తోంది. ఇక అటు టెస్ట్ సిరీస్ కోల్పోయిన బంగ్లాదేశ్ కచ్చితంగా టి20 లో గెలవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది.

India vs Bangladesh, 2nd T20I

భారత జట్టు: సంజు శాంసన్ (wk), సూర్యకుమార్ యాదవ్ (c), అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్,

బంగ్లాదేశ్ జట్టు: లిట్టన్ దాస్ (WK), నజ్ముల్ హొస్సేన్ శాంటో (c), పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకర్ అలీ, మెహిదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్

Read more RELATED
Recommended to you

Latest news