హర్యానాలో బిజేపీకి భంగపాటు తప్పదని వస్తున్న ప్రచారాలకు కమలం పార్టీ చెక్ పెట్టింది.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ.. హర్యానాలో మరోసారి బిజేపీ అధికారంలోకి వచ్చింది.. హర్యానాలో కాంగ్రెస్ విజయం ఖాయం అనుకుంటే, కాషాయం దూకుడు పెంచింది. బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది..
మోదీ ఛరిష్మా.. హర్యానాలో అందించిన సంక్షేమ పథకాలు.. రైతుల కోసం ప్రవేశ పెట్టిన సంస్కరణలు వంటివి బిజేపీకి మూడోసారి విజయాన్ని అందించాయి.. 48 స్థానాల్లో విజయ డంకా మోగించి.. మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.. కౌంటింగ్ ప్రారంభంలో కాంగ్రెస్ దూకుడుగా ఉన్నప్పటికీ.. గంటల్లోనే సీన్ మారింది.. బిజేపీ మ్యాజిక్ ఫిగర్ ను రీచ్ అయ్యింది.. 90 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 48 చోట్ల బీజేపీ.. 37 స్థానాల్లో కాంగ్రెస్.. ఐఎన్ ఎల్ డి రెండు స్థానాలు, స్వతంత్రులు మూడు స్థానాల్లో గెలిచారు..
మోడీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు..అభ్యర్దుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారాల దాకా అన్ని ప్లాన్ చేసి మరీ చేశారు.. కాంగ్రెస్ పార్టీ.. క్రీడాకారులకు టిక్కెట్లు ఇచ్చి ఎన్నికలబరిలోకి దింపితే.. బిజేపీ మాత్రం సాంప్రదాయ ఓటు బ్యాంకు మీదే ఆదారపడి.. పార్టీ నేతలకే టిక్కెట్లు కేటాయించింది.. కీలకమైన నియోకవర్గాల్లో మోడీ, అమిత్ షాలు చేసిన ప్రచారాలు ఆ పార్టీకి ప్లస్ అయ్యాయి.. మూడోసారి హర్యానాలో బిజేపీ అధికారంలోకి రాదని రాజకీయ విశ్లేషకులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. మోడీ ఛరిష్మాతో మరోసారి హర్యానలో కమలం వికసించింది..
హర్యానాలో బిజేపీ నేతలు, కార్యకర్తల సంబరాలు అంబరానంటున్నాయి.. బిజేపీ ఓటుబ్యాంకు చీలకుండా మోడీ తీసుకున్న చర్యలతో బిజేపీ మరోసారి అధికారంలోకి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. లడ్వా నుంచి హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీ గెలుపొందారు.. మరోపక్క కాంగ్రెస్ పార్టీ నుంచి జులానా నుంచి పోటీ చేసిన వినేష్ పొగట్ గెలుపొందారు.. మొదటి నుంచి ఆమె గెలుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.. అయితే తొలిసారి పోటీచేసినప్పటికీ.. మంచి విజయాన్ని ఆమె అందుకున్నారు.. మొత్తంగా హర్యానాలో మూడోసారి బిజేపీ తన మార్క్ రాజకీయాన్ని ప్రతిపక్షాలకు చూపెట్టి..అధికారంలోకి వచ్చింది..