హంకాంగ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

-

హాంకాంగ్ దేశంలో తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. హాంకాంగ్ సముద్ర తీరాన లాన్తావ్ ఐలాండ్ తుంగ్ చుంగ్ ప్రొమెనెడ్ వద్ద బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పెద్దలతో పాటు పిల్లలు సైతం ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.బతుకమ్మ వేడుకలను ఆటపాటలతో సముద్ర తీరం వెంబడి జరుపుకున్నారు.

తెలంగాణ పండుగ బతుకమ్మను ఘనంగా జరుపుకున్నామని ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఆనందం వెల్లడించారు. బతుకమ్మతో పాటు దసరా కూడా ఇక్కడ ఘనంగా జరుపుకుంటామని, బతుకమ్మ పండుగలో తెలంగాణ ఆడపడుచులతో పాటు ఇతరులు కూడా ఆనందంగా పాల్గొన్నారని తెలిపారు. దసరా నవరాత్రుల్లో లలితా పారాయణం, బొమ్మల కొలువు, పేరంటాలను సైతం నిర్వహిస్తామని, పండుగకు పదిహేను రోజుల నుంచి కోలాహలం ఉంటుందని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news