హర్యానా ఫలితాలపై విజయసాయి సంచలన పోస్ట్‌..!

-

హర్యానా ఫలితాలపై విజయసాయి సంచలన పోస్ట్‌ పెట్టారు. హర్యానా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి “ప్రపంచ బ్యాంకు జీతగాడు…చంద్రబాబు మోసగాడు”……అన్న కమ్యూనిస్టుపార్టీల పాత పాట గుర్తుకొస్తుందని సెటైర్లు పేల్చారు సాయిరెడ్డి. ఎలెక్షన్ కమిషన్ 3 నెలలు తర్వాత “ఫార్మ్ 20” వెబ్ సైట్ లో పెట్టిందని…. పోలింగ్ బూత్ వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో చూసుకోవచ్చు అంటూ చురకలు అంటించారు.

Vijayasai Reddy gave clarity on party change

ఎన్నికలు ఫలితాలు వెలువతున్నప్పుడు ఆ తర్వాత మొదటి రెండు వారాలు ఎవరూ కోర్టుకి వెళ్లకుండా ప్రజల్లో చర్చ జరగకుండా టీడీపీ గూండాలు అరాచకం చేసారన్నారు. ఫారం 20 వివరాలు బయటకి రాగానే లడ్డు వ్యవహారం వాళ్ళ కుట్రలో భాగంగా పక్కా స్కెచ్ తో మొదలెట్టారు. చంద్రబాబుకు నిజానిజాలతో పనిలేదు. ఇది నెయ్యికోసమో భగవంతుడి కోసమో మొదలెట్టింది కాదు. ఈవీఎం మోసాలని కప్పిపెట్టటానికి మొదలెట్టిన అరాచకం అంటూ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు సరిగ్గా గుజరాత్ వెళ్లి వచ్చిన 6 రోజుల తర్వాత కుట్రలో భాగంగానే ఈ తప్పుడు రిపోర్ట్ ని ముందుగా గుజరాత్ నుండి తెప్పించి పెట్టుకుని టీటీడీకి పాలకమండలి వేయకుండా తాత్సారం చేస్తూ వచ్చాడని ఆరోపనలు చేశారు విజయ సాయి.

Read more RELATED
Recommended to you

Latest news