మెగాస్టార్ ‘విశ్వంభర’ టీజర్ రిలీజ్.. అభిమానులకు పండుగే..!

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో పాంటసీ చిత్రం విశ్వంభర. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్, వంశీ, ప్రమోద్  నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో త్రిష, అశిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చుతున్నారు.  ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు సమాచారం.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే.. మెగా అభిమానులకు సరైన దసరా పండుగ అనే చెప్పాలి. పండుగ సందర్భంగా విడుదల చేసిన విశంభర టీజర్ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్ మెంట్ ఇస్తోంది. 1.33 నిమిషాల నిడివి గల వీడియో ఆకట్టుకుంటోంది. విజువల్స్ వండర్ అనే చెప్పాలి. విశ్వాన్ని అదుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రాన వెలుగు రాదని కాదు.. ప్రశ్నలు పుట్టించిన కాలమే.. సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది.   విర్రవీగుతున్న ఈ అరాచకానికి ముగింపు పలికే మహా యుద్ధాన్ని తీసుకొస్తుంది. అనే డైలాగ్స్ డైలాగ్ ఆకట్టుకుంటున్నాయి. ఎగిరే తెల్లటి గుర్రం మీద చిరంజీవి  పయనించడం ఆకట్టుకుంటోంది. 

Read more RELATED
Recommended to you

Latest news