ఇరాన్ పై అమెరికా కన్నెర్ర.. 16 చమురు కంపెనీలపై ఆంక్షల కొరడా

-

ఇజ్రాయిల్ పై హమాస్ దాడులతో ప్రారంభమై ఇప్పుడు పశ్చిమాసియాకు విస్తరించిన పోరు అరబ్ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇరాన్ – ఇజ్రాయిల్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ పై ఆంక్షలు విస్తరించింది.

ఇజ్రాయిల్ పై క్షిపనులతో ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో పెట్రోలియం, పెట్రో కెమికల్స్ సెక్టార్ లో ఆంక్షలను విస్తరించినట్లు అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రకటనలో వెల్లడించింది. ఇరాన్ కి చెందిన 16 చమురు కంపెనీలను, 17 చమురు నౌకలను అమెరికా బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ చర్యలతో ఇరాన్ పై ఆర్థిక ఒత్తిడిని తీవ్రం చేస్తామని తెలిపింది. ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడికి ప్రతిస్పందనగా, ఇరాన్ కి నిధులు వచ్చే మార్గాలను దెబ్బతీయాలని ఉద్దేశంతో అమెరికా నిర్ణయాత్మక చర్యలు చేపట్టింది.

“ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులకు ఇరాన్ అక్రమ చమరును చేరవేస్తే చర్యలు ఉంటాయని, ఈ ఆంక్షలు ఇరాన్ చేపట్టే క్షిపని కార్యక్రమాలు, అమెరికా దాని మిత్రదేశాలపై ఉగ్రవాద దాడులు చేయడానికి అవసరమయ్యే ఆర్థిక వనరులను దెబ్బతీయడంలో సహాయపడతాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలోని పెట్రోలియం, పెట్రోల్ కెమికల్ రంగాలలో పనిచేయాలని నిర్ణయించుకున్న ఏ వ్యక్తికైనా ఆంక్షలు విధించవచ్చు” అని అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సుల్లివన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news