ఏంటీ తేలు విషం లీటర్ రూ.80 కోట్లా..? ఇంత ఖరీదు ఎందుకంటే..?

-

తేలును చూస్తే మనం పారిపోతాము. తేలు కుట్టిందంటే చాలు మనకి ఒక్కసారిగా భయం వచ్చేస్తుంది. ఎక్కడైనా ఎవరికైనా తేలు కుట్టిందంటే చాలు వణికిపోతూ ఉంటాం. అయితే తేలు అంటే ముందు మనకి గుర్తొచ్చేది విషం. తేలు విషం ఎంత ఖరీదు మీకు తెలుసా..? ఒక లీటర్ తేలు విషం10 మిలియన్ డాలర్లు, అంటే 80 కోట్లు పైనే. వామ్మో ఇంత ఖరీదా అని ఆలోచిస్తున్నారా..? అసలు ఈ విషం దేనికైనా పనికొస్తుందా..? ఎందుకు ఇంత ఖరీదు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఒక ల్యాబ్ తేళ్ల నుంచి రోజుకి రెండు గ్రాముల విషాన్ని సేకరిస్తోంది.

 

scorpion venom

బాక్సుల్లో పెట్టి తేళ్ళను బయటకు తీసి వాటి నుంచి ప్రత్యేక పద్ధతుల్లో విషాన్ని సేకరిస్తున్నారు. విషంఎలా సేకరిస్తారు..? దాంతో ఏం చేస్తారనేది చూసేద్దాం. తేళ్లను పెంచి వాటి నుంచి విషాన్ని సేకరిస్తారట. ఆ విషాన్ని గడ్డ కట్టేలా చేస్తారట. దానిని పొడిగా మార్చి విక్రయిస్తారు. తేలు విషయాన్ని యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, కాస్మొటిక్స్ తయారీలో వాడతారట.

ఒక తేలులో రెండు మిల్లీ గ్రాముల విషం ఉంటుంది. అదే ఒక గ్రాము విషం కావాలంటే 300 నుంచి 400 తేళ్ల నుంచి సేకరిస్తారు కానీ ఒక్క లీటర్ తేలు విషం ఏకంగా 80 కోట్లు పైనే. ఒక లీటర్ తేలు విషం సేకరించడం అంటే మామూలు విషయం కాదు. చాలా తేళ్లని తెచ్చి ఒక లీటర్ విషాన్ని సేకరించాలి. యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, కాస్మొటిక్స్ తయారీలో ఉపయోగించడం వలన ఈ తేళ్ల విషానికి ఇంత డిమాండ్.

Read more RELATED
Recommended to you

Latest news