సిద్ధిఖీ హత్య వెనుక ఉంది అతనే ఉన్నాడంటూ దర్శకుడు RGV సంచలన పోస్ట్ పెట్టారు. మహారాష్ట్ర మాజీ మంత్రి, సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ బాబా సిద్ధిఖీ హత్య వెనుక ఉన్న కారణాన్ని చెప్పారు టాలీవుడ్ డైరెక్టర్ ఆర్జీవీ. కృష్ణ జింకలను వేటాడిన సూపర్ స్టార్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ లాయర్ తన వృత్తిని మానేసి గ్యాంగ్‌స్టర్ అవతారం ఎత్తాడని పోస్ట్ పెట్టారు.
సల్మాన్ స్నేహితుడిని చంపడానికి ఫేస్ బుక్ ద్వారా దాదాపు 700 మందితో టీమ్ ఏర్పాటు చేసి చంపాడని తెలిపారు. అతడిని పట్టుకోవడం పోలీసులకు ఛాలెంజే అంటూ వ్యాఖ్యానించారు దర్శకుడు RGV. ఈ కథను సినిమాగా తెరకెకిస్తే హిట్టే అంటూ ఎక్స్ లో ఆర్జీవీ పోస్ట్ చేశారు.
A LAWYER turned GANGSTER wants to take REVENGE for a DEER’S death by killing a SUPER STAR and as a WARNING orders some of his GANG of 700 , which he recruited through face book to first kill a BIG POLITICIAN who is a close friend of the STAR ..
The POLICE can’t catch him because…— Ram Gopal Varma (@RGVzoomin) October 14, 2024