AKanda2 : నాలుగోసారి బాలయ్య-బోయపాటి కాంబో.. థియేటర్లలో ఇక ‘తాండవమే’!

-

నందమూరి బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరోమూవీ రానుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు ‘సింహ’, ‘లెజెండ్‌’, ‘అఖండ’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. కరోనా తర్వాత 2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అఖండ’ బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ల జాబితాలో చేరింది. దీంతో బాలయ్య-బోయపాటి కాంబో అనగానే అభిమానులకు పూనకాలు వస్తుంటాయి.

ఈ హిట్ కాంబినేషన్ తాజాగా మరోసారి రిపీట్‌ కానుంది. ‘అఖండ 2-తాండవం’ పేరుతో సీక్వెల్‌ తెరకెక్కనుంది. టైటిల్‌ పోస్టర్‌ను నిర్మాణసంస్థ తాజాగా విడుదల చేసింది.పోస్టర్‌లో ఆధ్యాత్మికతను జోడిస్తూ.. శివలింగం, రుద్రాక్షలు, హిమాలయాలు వంటి పలు అంశాలను హైలెట్ చేశారు. బాలయ్యను మాస్‌ అవతారంలో చూపించడంలో బోయపాటికి సెపరేటు స్టైల్ ఉంటుంది. ఈసారి కూడా డిఫరెంట్‌గా బాలయ్యను చూపిస్తాడని టాక్. అంతేకాకుండా ఇప్పటివరకు తీసిన అన్ని చిత్రాల్లో బాలయ్య డ్యుయెల్ రోల్ చేశారు. అఖండ-2లోనూ అదే కొనసాగుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తుండగా.. భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news