బాంబు బెదిరింపులపై కేంద్రం సీరియస్.. వారి పేర్లు నో -ప్లై లిస్ట్ లో..!

-

భారత విమానయాన సంస్థలకు చెందిన పలు విమానాలకు గత నాలుగు రోజులుగా వరుస బాంబు బెదిరింపులు రావడంతో పలు విమాన సర్వీసులు రూట్ మార్చడంతో పాటు అత్యవసరంగా ల్యాండింగ్ అవుతున్నాయి. ఇలాంటి పనులు చేసే ఆకతాయిల ఆటకట్టించేందుకు కఠిన చర్యలు తీసుకునే దిశగా పౌర విమానయాన శాఖ సన్నద్దమవుతున్నట్టు సీనియర్ అధికారి తెలిపారు.

గత నాలుగు రోజుల్లో 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిలో జాతీయ, అంతర్జాతీయ విమానాలు కూడా ఉన్నాయి. వీటి పై చేపట్టిన విచారణలో అవన్నీ నికలీవని తేలాయి. దీంతో ఇలాంటి పనులు చేసే ఆకతాయిలను అడ్డుకునేందుకు పౌర విమానయాన శాఖ నడుం బిగించింది. వారిని నో- ప్లై లిస్ట్ లో యాడ్ చేయాలని చూస్తోంది. అంతేకాదు.. అలాంటి వారికి కఠిన శిక్షలు వేసేలా బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ లో మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది. ఈ నిబంధనలలో మార్పులు చేసేందుకు అభిప్రాయాలను సేకరిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news