ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత.. రెడ్‌జోన్‌లో 13 ప్రాంతాలు!

-

దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం ఢిల్లీలో బుధవారం గాలి నాణ్యత 230 ఉండగా..శుక్రవారానికి 293కు దిగజారింది. ఆనంద్ విహార్‌లో 339, అలీపూర్‌ 304, బవానా 329, బురారీ 339, ద్వారకా సెక్టార్‌ 324, జహంగీర్‌పురి 354, ముండ్కా 375, నరేలా 312, పంజాబీ బాగ్ 312, రోహిణి 362, షాదీపూర్ 337, వివేక్ విహార్ 327గా ఏయిర్ క్వాలిటీ దారుణంగా దిగజారింది. ఇకపోతే ఢిల్లీలోని 13 ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు.

రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయుకాలుష్యం తీవ్రంగా పెరగడంతో మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే బాణసంచా వాడకంపై సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి వరకు బాణాసంచా తయారీ, వినియోగం, అమ్మకాలు నిలిచిపోనున్నాయి. కాగా, 0 నుంచి 50 పాయింట్ల వరకూ ఉంటే గాలినాణ్యత బాగుందని అర్థం.ఇఖ 301 దాటితే గాలిలో నాణ్యత క్షీణించిందని, 400 -450 దాటితే పరిస్థితి దారుణంగా ఉందని అర్థం చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news