కంగువ ఆడియో రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!

-

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం కంగువ. సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వం తెరకెక్కుతోంది. పాన్ ఇండియా భాషల్లో భారీ బడ్జెట్ పై స్టూడియో గ్రీన్ బ్యానర్ పై నిర్మించారు. షూటింగ్ ఎప్పుడో ముగించుకున్న ఈ సినిమా వాస్తవానికి అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో దసరా రేస్ నుంచి తప్పుకుంది. ఇటీవలే కంగువ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ఎప్పుడూ అని ఎదురు చూసిన అభిమానులకు తాజాగా గుడ్ న్యూస్ అందించారు మేకర్స్. అక్టోబర్ 26న చెన్నైలోని నెమ్రు స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ చిత్రం ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నట్టు ఓ వీడియో రిలీజ్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈ ఈవెంట్ కి చీఫ్ గెప్ట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సూర్య సరసన దిశా పఠానీ కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే విడుదల చేసిన టీజర్ తో అంచనాలు పెంచేసింది. కంగువ నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news