2027 ఫిబ్రవరి నెలలో జమిలి ఎన్నికలు : ప్రహ్లాద్ జోషి

-

భారతదేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే.. అభివృద్ధి పనులకు ఆటంకం కలుగకుండా ఉంటుందని.. ఖర్చు కూడా ఆదా అవుతుందని గతంలోనే తెలిపింది. ఇటీవల కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు మాత్రం జమిలీ ఎన్నికలపై కాస్త తర్జన భర్జనలో ఉన్నాయి. దేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోందని తెలుస్తోంది. 

వాస్తవానికి జమిలీ ఎన్నికలు జరగాలంటే.. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 83, 85, 172, 174, 356 లు రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా చేయాలని సూచించింది. ఈ బిల్లు యాక్సెప్ట్ అవ్వాలంటే.. లోక్ సభ, రాజ్యసభలో 67 శాతం మంది సపోర్ట్ చేయాలి. 14 రాష్ట్రాలు అసెంబ్లీలు సపోర్ట్ చేయాలని.. అలా మద్దతు ఇస్తే.. బిల్లు రాజ్యాంగ పరిధిలోకి వస్తుంది. ఈ బిల్లు 2024 శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుకు పార్లమెంట్ లో మద్దతు లభిస్తే.. 2027 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు దేశం మొత్తం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికలు జరిగిన 100 రోజుల తరువాత మున్సిపల్, గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుంది. దేశం మొత్తం పరిపాలన సౌలభ్యం కొరకు ఈ జమిలీ ఎన్నికలు జరుపనున్ననట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news