వాలంటీర్ల విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారు. ఏపీ హైకోర్టులో పిటిషన్ ఉపసంహరించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాలంటీర్ల మీద గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కింద కేసు నమోదు చేయాలని గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ కొట్టేయాలని హైకోర్టులో పవన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విత్ డ్రా చేసుకుంటామని ఇటీవల విచారణ సమయంలో కోర్టుకు తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరపు న్యాయవాది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు అనుమతిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.