ప్రపంచం మొత్తం భారత్ వైపే చూస్తోంది : ప్రధాని మోడీ

-

ప్రపంచం మొత్తం యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలలో కొట్టుమిట్టాడుతున్న వేళ మన దేశంలో ‘భారత్‌ శతాబ్ది’వేడుకల గురించి ఆలోచిస్తున్నదని ప్రధాని మోడీ తెలిపారు. ‘ది ఎన్డీటీవీ వరల్డ్‌ సమ్మిట్‌’లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచం చూపు మొత్తం భారత్‌ వైపే ఉందని పేర్కొన్నారు. మన దేశం అన్ని రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం ఇప్పటికే 125 రోజులు పూర్తి చేసుకుందన్నారు.

పేదలకు 3 కోట్ల గృహాలు కట్టిస్తామన్నారు. రూ.9 లక్షల కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్టులపై పని ప్రారంభించామని, 15 వందేభారత్‌ రైళ్లను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా 8 కొత్త ఎయిర్‌ పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. యువతకు రూ.2 లక్షల కోట్ల ప్యాకేజీ, రైతుల ఖాతాల్లో రూ. 21 వేల కోట్ల నగదు బదిలీ, 70 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యం కోసం ఆయుష్మాన్ భారత్ స్కీం వర్తింపు, 5 లక్షల ఇళ్లలో రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మన స్టాక్‌మార్కెట్‌ సూచీల్లో దాదాపు 7 శాతం వృద్ధి నమోదవ్వగా.. విదేశీ మారకద్రవ్యం 700 బిలియన్‌ డాలర్లను దాటిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news