తెలంగాణలో విద్యుత్ సేవల కోసం ప్రత్యేక విద్యుత్ వాహనాలు…!

-

తెలంగాణలో విద్యుత్ సేవల కోసం ప్రత్యేక విద్యుత్ వాహనాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్‌ పార్టీ సర్కార్‌. ప్రజలకు విద్యుత్ సేవలు అందిచేందుకు దేశంలోనే తొలిసారి అంబులెన్స్ తరహాలోనే ప్రత్యేక విద్యుత్ వాహనాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం GHMC పరిధిలోని 57 సబ్ డివిజన్ లకు 57 వాహనాలను కేటాయిస్తూ డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ వాహనాలను ప్రారంభించారు.

తెలంగాణలో విద్యుత్ సేవల కోసం ప్రత్యేక విద్యుత్ వాహనాలు…!

ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, ముగ్గురు లైన్ మెన్లు మరియు అవసరమైన మెటీరియల్ తో సేవలు అందించేందుకు 24 గంటల పాటు సిద్ధంగా ఉంటారు. ఈ వాహనాలను తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ ప్రారంభించారు. గతంలో అత్యవసర విద్యుత్ సేవల పునరుద్దరణకు ప్రత్యేక వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించేందుకు అంబులెన్స్ తరహాలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news