మలేషియా పర్యటనలో మంత్రి తుమ్మల.. పామాయిల్ సాగుపై స్టడీ!

-

మలేషియాకు చేరుకున్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బిజీబిజీగా గడుపుతున్నారు. నేటి నుంచి మూడ్రోజుల పాటు ఆయిల్ పామ్ సాగుపై స్టడీ టూర్ నిర్వహించనున్నారు. బుధవారం కౌలాలంపూర్‌లో ప్లాంటేషన్ కమోడిటీస్ ఇండస్ట్రీ మలేషియా మంత్రి జోహారీ ఘని, మ్యాట్రేడ్ చైర్మన్ రీజల్ మెరికన్‌తో మంత్రి తుమ్మల సమావేశం కానున్నారు. కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్‌లో ఆయిల్స్ అండ్ ఫాట్స్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్‌ను విజిట్ చేయనున్నారు. హార్వెస్టింగ్ టూల్స్ డెమోను తుమ్మల పరిశీలించనున్నారు.

భారత్ ప్రతిఏటా మలేషియా,ఇండోనేషియా నుంచి 70 శాతం పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. అందుకే నేరుగా పామాయిల్‌ను ఇండియాలో సాగుచేస్తే దిగుమతి చేసుకోవాల్సిన పనిఉండదు. దీనివలన భారీగా విదేశీ మారకద్రవ్యం ఆదా కానుంది. దేశంలో సాంప్రదాయ పంటల సాగుకు అలవాటు పడిన రైతులు ఆయిల్ ఫామ్ సాగుచేయాలంటే పంట చేతికొచ్చే వరకు ప్రభుత్వాలు ఆర్థిక సాయం అందించడంతో పాటు వారిని ప్రోత్సహించాలి. ఈ క్రమంలోనే మంత్రి తుమ్మల తెలంగాణ రైతులను ఆయిల్ ఫామ్ సాగుపై పదే పదే వారికి అవగాహన కల్పిస్తున్నారు.ఆయిల్ ఫామ్ సాగుతో ఎకరానికి రూ.లక్షన్నర నుంచి రూ.1 లక్ష వరకు ఆదాయం వస్తుందని మంత్రి పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news