Dana Toofan: దూసుకొస్తోన్న దానా..పలు రైళ్ళను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే…!

-

Dana Toofan: దానా దూసుకొస్తోంది. దీని ప్రభావంతో పలు రైళ్ళను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.వాయుగుండం..నేడు తుఫానుగా బలపడనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడింది వాయుగుండం. దీంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీనికి ‘దానా’ తుఫానుగా పేరు పెట్టింది భారత వాతావరణ కేంద్రం.

ఒడిశా, బెంగాల్ వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో VZM, మన్యం, శ్రీకాకుళం జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇటు రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో మరో నాలుగు రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దానా తూఫాన్ నేపథ్యంలో పలు రైళ్ళను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే…

ఇవ్వాళ…
సికింద్రాబాద్ – భువనేశ్వర్
హైదారాబాద్ – హౌరా
సికింద్రాబాద్ – హౌరా
సికింద్రాబాద్ – మల్దాటౌన్

రేపు….
హౌరా – సికింద్రాబాద్
షాలిమార్ – హైదారాబాద్
సిల్చార్ – సికింద్రాబాద్

Read more RELATED
Recommended to you

Latest news