అంతర్జాతీయ స్థాయిలో బాపుఘాట్ నిర్మాణం : సీఎం రేవంత్

-

సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూపు తిప్పేలా అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీని ఆదర్శరంగా తీసుకుని బాపూ ఘాట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూఘాట్ ఉందని, గుజరాత్‌లోని సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహం మాదిరిగా బాపూ ఘాట్‌లో గాంధీ విగ్రాహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

శుక్రవారం నగరంలో ఏబీపీ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ది సదరన్ రైజింగ్ సమ్మిట్’ను సీఎం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ..మూసీ పునరుజ్జీవం చేసి గాంధీ వారసులుగా బాపూ ఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేస్తామంటే బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు అడ్డుపడుతున్నాయని సీఎం రేవంత్ ప్రశ్నించారు.మీరు గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మాణం చేయొచ్చు.. కానీ, మేం మూసీ పునరుజ్జీవం చేస్తామంటే బీజేపీ నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. గుజరాత్‌తో పోటీ రాకుండా తెలంగాణను,హైదరాబాద్‌ను ఫినిష్ చేయాలని బీజేపీ నేతలు ప్రభుత్వానికి అడ్డం పడుతోందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news