ఏంటీ..ముఖానికి, శరీరానికి ఒకటే సోప్‌ వాడొద్దా..? ప్రమాదమా.!

-

ఆరోగ్యం పైనే మనకు సరిగ్గా శ్రద్ధ ఉండదు.. ఇంకా స్కిన్‌ పైన ప్రత్యేక ఇంట్రస్ట్‌ ఏం ఉంటుంది చెప్పండి. మీకు తెలుసో లేదో..మనం ఫాలో అవ్వాలే కానీ.., చాలా రూల్స్‌ ఉంటాయి. లెజెండ్స్‌ రూల్స్‌ బ్రేక్ చేస్తారు..ఫాలో అవ్వరూ అనుకుంటూ బతికేస్తున్నాం. చాలామందికి స్నానం చెయ్యడం అంటే ఎక్కడలేని బద్ధకం వస్తుంది..అలాంటిది.. ఫేస్‌కు, బాడీకి ఒకటే సోప్‌ కాదు..వేర్వేరు వాడాలంటే..ఇంకా బాడీకి వాడిన టవల్నే ముఖానికి కూడా వాడుతుంటారు. ఇలా చేయడం కూడా మంచి పద్ధతి కాదు. కానీ అందరూ చేసేది ఇది. మన శరీరానికి సెట్‌ అయ్యే సోప్‌ ఫేస్‌కు కూడా సెట్ అవుతుందని లేదు. ఫేస్‌కు పడింది కూడా ముఖానికి పడుతుందని లేదు. మనం ఏంట్రా అంటే.రెండింటికి కలిపి ఒకటే వాడతాం. ఇది ప్రమాదం అని అంటున్నారు నిపుణులు.

మార్కెట్‌లో బోలెడు సోప్స్‌ ఉన్నాయి.. కానీ వాటిల్లో…హైపోఅలెర్జెనిక్, సువాసన లేని , చర్మాన్ని తేమగా ఉండే వాటిని మాత్రమే ముఖ సంరక్షణ కోసం ఉపయోగించాలంటున్నారు నిపుణులు. ముఖానికి వాడే సబ్బులు ప్రత్యేకంగా సిరామైడ్‌లు, నియాసినామైడ్, గ్లిసరిన్, హైలురోనిక్ యాసిడ్ ఉండేలా చూసుకోవాలట. ఇవి ముఖాన్ని కాంతివంతంగా, అందంగా చేస్తాయి. అలా కాకుండా.. శరీరానికి, ముఖానికి ఒకే రకం సోప్ వాడటం వల్ల సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

సోప్‌ ఇలా అస్సలు వాడొద్దు…

సబ్బను నేరుగా ముఖంపై రుద్దడం వల్ల కఠినంగా ఉంటుంది. దీని వల్ల ముఖంపై గీతలు లాంటివి పడే అవకాశం ఉంది. సబ్బులు చర్మాన్ని పొడిగా చేస్తాయి. అవి రసాయనాలతో నిండి ఉండటం వల్ల సబ్బులు చర్మం నుండి తేమను తొలగించి పొడి చర్మం ఏర్పడేలా చేస్తాయి. చాలా మంది మంచి స్మెల్‌ వచ్చే సోప్స్‌ మంచివి అనుకుంటారు. నిజానికి స్మెల్‌ రావడానికి సబ్బుల్లో ఏవేవో కెమికల్స్‌ వాడుతుంటారు. ఇవి మీ సున్నితమైన ముఖాన్ని పాడుచేస్తాయి. ఇది మొటిమలు, దీర్ఘకాలంలో ముడతలు రావడానికి కారణమవుతాయి.

PH ఎక్కువ ఉన్నవి ఫేస్‌కు మంచివేనా..?

చాలా సబ్బులలో pH లెవల్స్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం పీహెచ్‌ ఎక్కువ ఉన్నవి మంచివి అనుకుంటాం. అవును పీహెచ్‌ మీ శరీరంలోని మురికిని కడగడానికి తయారు చేయబడ్డాయి. కాబట్టి, వాటిని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. శరీరానికి ఉన్నంత మురికి, ముఖానికి ఉండదు. కానీ మనం అదే మోతాదులో కెమికల్స్‌ ఉన్నవి ఫేస్‌కు అప్లై చేస్తున్నాం.

మాయిశ్చరైజర్‌లతో నిండిన రసాయన రహిత ఉత్పత్తులను ఎంచుకోవడం మంచిది. సాలిసిలిక్ యాసిడ్ వంటి మొటిమలను చంపే పదార్థాలను కలిగి ఉన్నవాటిని ఎంచుకోవడం ఉత్తమమైన మార్గం. స్కిన్‌ కేర్‌లో భాగంగా క్లెన్సింగ్, టోనింగ్, ఎక్స్‌ఫోలియేటింగ్, మాయిశ్చరైజింగ్ ఉంటాయి. మీ చర్మ రకాన్ని బట్టి మీరు ఎంచుకోగల వివిధ రకాల క్లెన్సర్‌లు ఉన్నాయి.

ఏ స్కిన్‌కు ఎలాంటి క్లెన్సర్స్‌ మంచివో ఇప్పుడు చూద్దాం..

జెల్ క్లెన్సర్స్: జిడ్డు చర్మం వారికి మంచిది.

క్లే క్లీనర్లు: క్లే క్లెన్సర్లు మొటిమలను క్లియర్ చేయడంలో సహాయపడతాయి.

క్రీమ్ క్లెన్సర్‌లు: డ్రై స్కిన్ ఉన్న వారికి ఇవి బాగా సహాయం చేస్తాయి.

ఫోమ్ క్లీనర్లు: ఫోమ్ క్లీనర్లు నూనె , ధూళిని తొలగించడానికి మంచి మొత్తంలో నురుగును ఉత్పత్తి చేస్తాయి. నార్మల్ స్కిన్‌ ఉన్నవాళ్లు ఇవి వాడొచ్చు. ఉత్తమంగా

ఆయిల్ క్లెన్సర్‌లు: ఆయిల్ క్లెన్సర్‌లు బ్లాక్‌హెడ్స్ , వైట్‌హెడ్స్‌కు కారణమయ్యే రంధ్రాలను అన్‌లాగ్ చేస్తాయి.

కాబట్టి..ముఖం అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే..సోప్‌ విషయంలో చిన్నపాటి రీసర్చ్‌ చేయాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news