పళ్లు తెల్లగా ఉంటే చూసేందుకు అందంగా ఉంటుంది. కానీ అదేంటో మనం ఏది బాగుండాలని అనుకుంటామో అవే ఆగమైతాయి. ఫేస్ మీద ఒక మొటిమ, మచ్చ లేకుండా ఉండాలని అందరూ అనుకుంటారు కానీ ఉద్యమం లెక్క పింపుల్స్ వచ్చేస్తాయి. కళ్ల కింద నల్లమచ్చలు వద్దు అనుకుంటాం కానీ దెయ్యాలమాదిరి డార్క్ సర్కిల్స్ ఉంటాయి. ఇంకా మెడా, మోకాళ్ల గురించి చెప్పక్కర్లేదు..తారు ఫ్యాక్టరీయే.! ఇలా అందరికీ ఉంటాయని కాదు..కానీ చాలామంది అయితే ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కదా..! ఈ పళ్లు తెల్లగా అయ్యే కాన్సప్ట్ విషయానికి వస్తే.. నల్ల తుమ్మతో లాభం ఉంటుందంటున్నారు..అదేంటో మీరూ చూడండి.
అకాసియా మొక్కతో దంతాలు తెల్లగా మారతాయి. ఆయుర్వేదంలో అకేసియా మొక్క ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. ఇది చిగుళ్ళు, వాపు, ఫలకం, దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అకాసియా మొక్క అంటే అదేదో ఇండియాలో దొరకని పదార్థం అనుకునేరు.. నల్ల తుమ్మ అండీ..!
చిన్నప్పుడు నల్ల తుమ్మ నుంచి వచ్చే బంకతో పుస్తకాలు అంటికునే వాళ్లం గుర్తుందా..? బాబూల్ చెట్టు( నల్ల తుమ్మ) యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటిహిస్టామినిక్, యాంటీ హెమోస్టాటిక్ లక్షణాలను కలిగి ఉంది. విటమిన్లు, ఖనిజాలు కూడా ఇందులో ఉంటాయి. అకాసియాలో ఇనుము, మాంగనీస్, జింక్, ప్రోటీన్, వాలైన్, హిస్టిడిన్, ఐసోలూసిన్, థ్రెయోనిన్, లైసిన్, లూసిన్ వంటి ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఎన్నో ఉన్నాయి. అకేసియా ప్యాడ్లు, బెరడులో పాలీఫెనోలిక్, టానిన్లు పుష్కలంగా ఉంటాయి. మరోవైపు, అకాసియా గమ్‌లో గెలాక్టోస్, అరబినోబియోస్, మినరల్, కాల్షియం, మెగ్నీషియం, ఆల్డోబియో యురోనిక్ యాసిడ్ ఉంటాయి. చూడ్డానికి ఎందుకు పనికిరాని మొక్కలా ఉంటుంది.. ఇందులో ఇన్ని ఉన్నాయా అనిపిస్తుంది కదా..!దేన్ని లైట్ తీసుకోకూడదు మరీ..!
నల్ల తుమ్మ చెట్టును టూత్‌పేస్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. అకాసియా మీ నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల దంతాల పసుపు సమస్య తొలగిపోతుంది. దంతాలలోని ఇన్ఫెక్షన్లు కూడా దూరమవుతాయి.
ఎలా ఉపయోగించాలి
దంతాలు తెల్లగా మారడానికి, నల్ల తుమ్మ చెట్టుకు వచ్చే పువ్వులను, కాయలు కాల్చి, దాని నుండి బూడిదను తీయండి.. ఇప్పుడు బ్రష్ సహాయంతో దంతాల మీద అప్లై చేసి బ్రష్ లాగా వాడండి. కావాలంటే పటిక మెత్తని కొమ్మలను విరగొట్టి ముందు నుంచి నమిలి బ్రష్ లాగా వాడండి. ఇలా చేయడం వల్ల దంతాల నొప్పులు తొలగిపోయి పసుపు దంతాలు తెల్లగా మారుతాయి.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.