సరిహద్దుల్లో రెచ్చిపోతున్న పాకిస్తాన్, తల నరికి తీసుకువెళ్ళిన పాక్ ఆర్మీ…!

-

పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం ఒక పౌరుడి తల నరికి తీసుకువెళ్ళి౦దని అధికారులు చెప్పారు. శుక్రవారం పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంట హత్యకు గురైన ఇద్దరు పౌరులలో ఒకరి తలను తీసుకెళ్లారని అధికారులు పేర్కొన్నారు. పాక్ ఆర్మీ, ఉగ్రవాదులతో ఏర్పాటైన బాట్ ఇలా ఒక పౌరుడి తల నరికి తీసుకు వెళ్ళడం ఇదే మొదటి సారి అని అధికారులు పేర్కొన్నారు. గతంలో సైనికుల తలలు మాత్రమే నరికారు.

మహ్మద్ అస్లాం (28) మృతదేహం ఘోరంగా చిద్రం చేసారని, అతని తల కనిపించలేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. గుల్పూర్ సెక్టార్‌లోని కస్సాలియన్ గ్రామంలో నివసిస్తున్న అస్లాం, అల్తాఫ్ హుస్సేన్ (23) ఇద్దరూ మోర్టార్ షెల్‌తో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి మరణించారు. దీనిపై స్పందించిన ఆర్మీ ఉన్నతాధికారులు పాకిస్తాన్ కి అదే రీతిలో ఆర్మీ తో సమాధానం చెప్తామని హెచ్చరించారు.

ఇక ఇదిలా ఉంటే సరిహద్దుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భారత ఆర్మీ కాల్చి చంపింది. సరిహద్దులను దాటేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రవాదులను సైన్యం కాల్చి చంపింది. సరిహద్దుల్లో అలజడి రేగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీనితో పర్యాటకులు తమ పర్యటనలను రద్దు చేసుకోవాలని కూడా అధికారులు సూచించినట్టు తెలుస్తుంది. బ్యాట్ దళాలు కొంత కాలంగా సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news