పోలవరం డయాఫ్రమ్ వాల్‌ నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.900 కోట్లు – పురంధేశ్వరి

-

పోలవరం డయాఫ్రమ్ వాల్‌ నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.900 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపి పురంధేశ్వరి సమక్షంలో పార్టీలో చేరికలు జరిగాయి. ఈ సంర్భంగా పర్చూరు నియోజకవర్గం నుంచీ భారీగా బిజెపి తీర్థం పుచ్చుకున్నాయి వైసీపీ శ్రేణులు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ… ఏపీకి కేంద్రం సహకారం అందిస్తోందని తెలిపారు. అమరావతికి 15 వేల కోట్లు కేంద్రం ఇస్తుంటే.. హడ్కో కూడా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఇస్తున్నారని పేర్కొన్నారు.

900 crore from the Center for the construction of Polavaram Diaphragm Wall

అమరావతిని నాలుగు ప్రధాన నగరాలతో అనుసంధానిస్తూ రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పోలవరానికి వెచ్చించిన ప్రతీ పైసా కేంద్రం నుంచీ వచ్చినదే.. డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 900 కోట్లు ఇస్తున్నారన్నారు. గ్రామీణాభివృద్ధి కి 7800 కోట్లు కేంద్రం ఇచ్చిందని, 4800 కోట్లు రోడ్లు వేయడానికి కేంద్రం సహకరిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారని తెలిపారు. సబ్ కే సాత్, సబ్ కా వికాస్ కు ఇది నిదర్శనం… ధృడమైన నిర్ణయాలు తీసుకోగలిగే నాయకత్వాన్ని మోదీ అందించారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news