దేవర సాంగ్ కు స్టెప్పులు వేసినందుకు ..డ్రైవర్ ను తొలగించింది ఏపీ ఆర్టీసీ. కాకినాడలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బస్సు ఆగిపోవడంతో దేవర సాంగ్ కి స్టెప్పులు వేసిన ఆర్టీసీ డ్రైవర్ లోవరాజును విధుల నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. లోవరాజు డాన్స్ బాగా చేశాడని ట్విట్టర్ లో ప్రశంసించారు మంత్రి లోకేష్. రెండు రోజుల క్రితం తుని నుంచి రౌతులపూడి వెళ్తున్న ఆర్టీసీ బస్సు… సాంకేతిక సమస్యతో ఆగిపోయింది.
ఈ తరుణంలోనే… దేవర సాంగ్ కి డ్రైవర్ ను డ్యాన్స్ వేయమన్నారట బస్సులో ఉన్న స్టూడెంట్స్. దీంతో…దేవర సాంగ్ కు స్టెప్పులు వేశాడు ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు. దీంతో ఆర్టీసీ డ్రైవర్ లోవరాజును విధుల నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. తాను ఉద్దేశపూర్వకంగా బస్సు ఆపలేదని వెళ్లే అవకాశం లేకపోవడంతోనే ఆపానని తన ఉద్యోగం తనకు ఇప్పించాలని కోరుతున్నాడు లోవరాజు. ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు లోవ రాజు.