షర్మిల లాంటి చెల్లి జగన్ కు ఉండడం చాలా బాధాకరం – భూమన

-

షర్మిల లాంటి చెల్లి జగన్ కు ఉండడం చాలా బాధాకరం అంటూ ఆగ్రహించారు భూమన కరుణాకర్ రెడ్డి. ఇవాళ మీడియాతో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ… జగన్ నాయకత్వంలో పనిచేయడం మాకు గర్వకారణమని తెలిపారు. ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీని ఎదిరించిన ధీశాలి జగన్ అని కొనియాడారు. తెలంగాణ నా మెట్టునిల్లు అని చెప్పిన షర్మిళ, చివరకు అక్కడ చాప చుట్టి ఏపి కి వచ్చారని ఫైర్‌ అయ్యారు.

bhumana sharmila

షర్మిల వెనుక ఏ ఒక్క రాజశేఖరరెడ్డి అనుచరులు రాలేదు. అంతా జగన్ వెనుక నడిచారని విమర్శలు చేశారు. చివరకు కాంగ్రెస్ లోనూ మీకు మద్దతు లేదని… ఇవాళ అన్ని విధాలా షర్మిళ ఒంటరి అయ్యారని చురకలు అంటించారు. షర్మిళ లాంటి చెల్లి జగన్ కు ఉండడం చాలా బాధాకరం… రాజశేఖర్ రెడ్డిని ప్రజల గుండెల నుంచి తుడిచేయాలని భావించే టిడిపితో షర్మిళ కుమ్మక్కు అవడం దారుణం అంటూ ఆగ్రహించారు భూమన కరుణాకర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news