గడ్డి మందు.. 51 మంది కేజీబీవీ విద్యార్థినిలకు తీవ్ర అస్వస్థత!

-

రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మంథని రెవెన్యూ డివిజన్ పరిధిలోని ముత్తారం మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సుమారు 51 మంది విద్యార్థినీలు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. వారంతా తీవ్రమైన దగ్గు, తలనొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం.

గడ్డి మందు పీల్చడం వల్లే వారికి ఇలా అయ్యిందని తెలుస్తుండగా.. పేరెంట్స్ మాత్రం గడ్డి మందు చల్లాక తమ పిల్లలతో ఆ గడ్డిని పీకించారని అందుకే వారు అనారోగ్యానికి గురయ్యారని ఆరోపిస్తున్నారు. పాఠశాలలో పిల్లలు అనారోగ్యానికి గురవ్వడానికి గల కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధిత పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థినులకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్టూడెంట్ యూనియన్ నాయకులు పాఠశాల మేనెజ్మెంట్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news