పెట్టుబడి తక్కువగా ఉండాలి, లాభం మాత్రం కాస్త ఎక్కువగానే రావాలి. రిస్క్ తక్కువగా ఉండాలి.. ఇలాంటి జోనర్లో ఏదైనా బిజినెస్ ఐడియా ఉంటే చెప్పబ్బా అంటూ ఎవరైనా మిమ్మల్ని అడుగుతున్నారా..? పోనీ మీరే కొత్తగా వ్యాపారం చేయాలి అనుకుంటున్నారా..? అయితే కాసులు కురుపించే ఈ బిజినెస్ ఐడియాలు మీ కోసమే..! చేతిలో ఎక్కువ డబ్బులు లేకపోయినా కూడా మీరు బిజినెస్ ప్రారంభించొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
తక్కువ బడ్జెట్లో ప్రారంభించే బిజినెస్‌లు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా వీటి ద్వారా అదిరే రాబడి కూడా సొంతం చేసుకోవచ్చు. మీరు రూ. 10 వేల బడ్జెట్లో కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సోషల్ మీడియా మేనేజ్మెంట్ సర్వీసులు అందించొచ్చు. మీకు కొత్త కొత్త ఐడియాలు తెలిస్తే, అలాగే ట్రెండ్స్‌ను కరెక్ట్‌గా పట్టుకోగలిగితే మీరు సొంతంగానే సోషల్ మీడియా మేనేజ్మెంట్ సర్వీసులు ప్రారంభించొచ్చు. మంచి రాబడి సొంతం చేసుకోవచ్చు.
బ్లాగింగ్ ద్వారా కూడా మంచి రాబడి పొందొచ్చు. డిజిటల్ ప్రపంచంలో బ్లాగింగ్ ద్వారా డబ్బు బాగా సంపాదించొచ్చు. మీకు రాసే సామర్థ్యం ఉంటే.. మీరు ఈ ఆప్షన్ ద్వారా కూడా డబ్బులు వెనకేసుకోవచ్చు.
ట్రావెల్ ఏజెన్సీ బిజినెస్ మంచి లాభసాటి వ్యాపారం. మీరు దీని ద్వారా కూడా రాబడి పొందొచ్చు. ట్రావెల్ సర్వీసులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అందువల్ల మీరు ట్రావెల్ ఏజెంట్‌గా కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. హోటల్స్, టూర్ ఆపరేటర్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవచ్చు.
ఫోటోగ్రఫీకి కూడా మంచి డిమాండ్ ఉంటది. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఫోటోగ్రాఫర్ అవసరం మనకు కచ్చితంగా ఉంటుంది. మీరు అద్భుతంగా ఫోటోలు తీయగలిగే సామర్థ్యం కలిగి ఉంటే.. మీరు ఫోటోగ్రఫీ ద్వారా కూడా డబ్బులు సంపాదించొచ్చు. ఇది కూడా ప్రాఫిటబుల్ బిజినెస్. అసలు కేవలం కెమెరాను గంటల్లో రెంట్‌కు ఇస్తూనే వేలల్లో సంపాదించుకోవచ్చు.
అలాగే ఆన్లైన్ క్లాసుల ద్వారా కూడా మీరు డబ్బు సంపాదించొచ్చు. మీకు టీచింగ్ మీద ఆసక్తి ఉంటే .. ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ ఎడ్యుకేషన్ బాగా డెవలప్ అవుతోంది. ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. అందుకే ఈ మార్గంలో కూడా మీరు రాబడి పొందొచ్చు.
యూట్యూబ్ ఛానళ్లతో కోటీశ్వరులు అయిన వాళ్లు కూడా ఉన్నారు. అందువల్ల మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాని ద్వారా డబ్బులు వెనకేసుకోవచ్చు. ఇది కూడా ప్రాఫిటబుల్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. వీడియోలు, రీల్స్ చేసుకుంటూ డబ్బులు పొందొచ్చు. అయితే మీకు క్రియేటివిటీ బాగా ఉండాలి.
మీరు ఘోస్ట్ రైటింగ్ ద్వారా కూడా డబ్బులు పొందొచ్చు. మీకు రాసే అలవాటు ఉంటే.. అలాగే ట్రాన్స్‌లేట్ చేయడం వస్తే.. ఘోస్ట్ రైటింగ్ ద్వారా డబ్బులు పొందొచ్చు. అంటే ఇది ఫ్రీల్యాన్సింగ్ అని చెప్పుకోవచ్చు. మీరు వేరే వారికి ట్రాన్స్‌లేట్ చేసి ఇస్తారు.
ఇలా మీకు ఉన్న ట్యాలెంట్‌ను బట్టి పార్ట్ టైమ్‌గా అయినా డబ్బులు సంపాదించొచ్చు. అంతెందుకు ఖాళీగా ఇన్‌స్టాలో రీల్స్ చూస్తూ కూడా పైసల్ సంపాదించవచ్చు. ఈరోజుల్లో ఖాళీగా ఎవ్వరూ లేరు. ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియని వాళ్లే ఖాళీగా ఉన్నారు. మనం గంటల తరబడి రీల్స్ చూస్తుంటాం.. మనం ఇలానే ఉంటాం.. కానీ ఆ రీల్స్ చేసేవాళ్లు మాత్రం డవలప్ అవుతారు. సీన్ కట్ చేస్తే అది వారికి పార్ట్ టైమ్ ఇన్కమ్ మాత్రమే. వాళ్ల కెరిర్ వాళ్లకు ఉంటుంది.!