Diwali Muhurat Trading 2024 : దీపావళి రోజున మార్కెట్లో లాభాలు పొందడానికి నిపుణుల సలహాలు

-

దీపావళి పండుగకు అందరూ సిద్ధమై పోయారు. కొన్ని ప్రాంతాల్లో పండగ సంబరం ముందుగానే వచ్చేసింది. వ్యాపారస్తులు లక్ష్మీ పూజల కోసం అంతా సిద్ధం చేసి ఉంచారు.

పిల్లలు టపాకాయలు కాల్చడానికి కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. దీపావళి సందర్భంగా జరిగే ముహూర్తం ట్రేడింగ్ కోసం ఇన్వెస్టర్లు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

అయితే ముహూర్తం ట్రేడింగ్ రోజున షేర్ మార్కెట్లో లాభాలు పొందాలంటే ఏం చేయాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఈ పద్ధతిలో పెట్టబడును పెట్టాలో నిపుణులు సలహా ఇస్తున్నారు.

బటర్ ఫ్లై పద్ధతి:

రిస్క్ తక్కువ చేసుకుని మరీ ఎక్కువ లాభాలు కాకుండా ఓ మోస్తారు లాభాలు కావాలనుకునే వారికి ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది.

ఈ పద్ధతిలో ఇన్వెస్టు ఎలా చేయాలంటే?

తక్కువ స్ట్రైక్ రేటులో కాల్ ఆప్షన్ కొనుక్కోవాలి.

మిడిల్ స్ట్రైక్ రేటులో రెండు కాల్ ఆప్షన్స్ అమ్మివేయాలి.

ఎక్కువ స్ట్రయిక్ రేటులో ఒక కాల్ ఆప్షన్ కొనుక్కోవాలి.

ఈ క్రమ పద్ధతి బట్టర్ ఫ్లై ఆకారంలో గ్రాఫ్ మీద కనిపిస్తుంది కాబట్టి దీన్ని బటర్ ప్లై పద్ధతి అంటారు.

అయితే కొంతమంది నిపుణులు మాత్రం ముహూర్తం ట్రేడింగ్ రోజున లాభాల కోసం చూడాల్సిన పనిలేదని చెబుతున్నారు. ఈరోజున కేవలం స్టాక్స్ కొంటే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయన్న నమ్మకంతోనే ఎక్కువ మంది స్టాక్స్ కొంటారని లాభాల కోసం చూడరని చెబుతున్నారు.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు స్టాక్ కి సంబంధించిన అన్ని వివరాలను క్షుణ్ణంగా చదవండి.

Read more RELATED
Recommended to you

Latest news