ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై… చంద్రబాబు సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు… డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమైందట చంద్రబాబు నాయుడు సర్కార్. నవంబర్ ఆరో తేదీన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా చర్యలు చేపడుతోందని వార్తలు వస్తున్నాయి.
రెండు లేదా మూడు నెలల్లో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారట. వచ్చే విద్యా సంవత్సరానికి గాను పోస్టింగులు కూడా ఈ 16,347 మందికి ఇవ్వాలని…. చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగిందట. దీంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల వారీగా ఖాళీలు అలాగే రోస్టర్ పాయింట్లు అలాగే సమాంతర…రిజర్వేషన్ల వివరాలను… రెడీ చేస్తున్నారట అధికారులు. ఇది ఇలా ఉండగా నిన్నటి రోజున టేట్ తుది కి ని రిలీజ్ చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. నవంబర్ రెండవ తేదీన ఫలితాలు రానున్నారు.