మురుగునీటిని గోదావరికి వదిలివేయడంతో దుర్వాసన : మాజీ ఎంపీ మార్గాని భరత్

-

రాజమండ్రిలో గోదావరి స్నాన ఘట్టాలు అస్థవ్యవస్థంగా తయారయ్యాయి. మురికి నీటిని గోదావరిలోకి వదిలివేయడంతో దుర్వాసన వస్తుంది అని వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. నవంబర్ 02 నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్బంలో స్నాన ఘట్టాలు బురదమయంగా మారిపోయి.. మురికినీటితో దుర్వాసన వెదజల్లుతున్నాయి. కార్తీక మాసం సందర్బంగా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రతీరోజు వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేసి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని చెప్పుకొచ్చారు.

రాజమండ్రిలోని పవిత్రమైన పుష్కర ఘాటు లోనూ ఇదే దుస్థితి నెలకొందన్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని మాజీ ఎంపీ భరత్ పేర్కొన్నారు. మార్కాండేయ ఘాట్ లో నరక చతుర్దశి సందర్భంగా గోదావరి నదిలోకి కలశ పూజ నిర్వహించడానికి వచ్చిన మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘాట్లు ఇలా ఉంటే.. కార్తీక మాసంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించడం ఎలా అంటూ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news