లక్ష్మీదేవిని దీపావళి నాడు ఆరాధించడం వలన లక్ష్మీదేవి మన ఇంట కొలువై ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. అయితే దీపావళి నాడు కొన్ని పొరపాట్లు మాత్రం చేయకూడదు. దీపావళి నాడు ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఎవరికి ఇవ్వకూడదు. పాత బట్టల్ని కూడా ఎవరికి దీపావళి నాడు ఇవ్వకూడదు. ఇలా చేయడం వలన కష్టాలు వస్తాయి. ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే దీపావళి నాడు నల్లటి వస్తువులను కూడా ఎవరికి ఇవ్వకూడదు. నల్లటి బూట్లు, నల్లటి బట్టలు వంటివి ఎవరికీ ఇవ్వకూడదు. దీని వలన ఆర్థిక నష్టం కలుగుతుంది.
ఇవే కాకుండా దీపావళి నాడు ఉప్పుని కూడా ఎవరికి దానం చేయకూడదు. ఎవరికైనా ఉప్పుని దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. బంధాలు బలహీనమవుతాయి. గొడవలు వస్తాయి. నెగటివ్ ఎనర్జీ కలుగుతుంది. అలాగే దీపావళి నాడు సాయంత్రం పూట ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు.
దీపావళి నాడు సాయంత్రం పూట డబ్బులు ఇవ్వడం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దీపావళి నాడు నెయ్య లేదా నూనెను కూడా ఇతరులకి దానం చేయకూడదు. నెయ్యి లేదా నూనెను దీపావలి నాడు ఎవరికైనా ఇవ్వడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలగకుండా పోతుంది. దీపావళి నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకుని లక్ష్మీదేవిని పూజించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే దీపాలతో అందంగా ఇంటిని అలంకరించి ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంటికి వస్తుంది.