భారత్-చైనా వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న పరిస్థితులపై తాజాగా కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఎల్ఏసీ వద్ద ఇరు దేశాల భద్రతా బలగాల ఉపసంహరణ కొలిక్కి వచ్చిందని అధికారులు ఆయనకు వివరించారు. ఇప్పటికే 90 శాతానికి పైగా సరిహద్దు బలగాలు వెనక్కి వచ్చాయని తెలిసింది.
ఈ సందర్భంగా రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఎల్ఏసీ వద్ద ఇరు దేశాల సైనికుల ఉపసంహరణ దాదాపుగా ముగిసిందని, డ్రాగన్ కంట్రీతో ఇంతకు మించి పరిష్కరాలను కోరుకుంటున్నట్లు తెలిపారు. అందుకు కాస్త సమయం పడుతుందన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. మేజర్ బాబ్ ఖాథింగ్ శౌర్య మ్యూజియాన్ని ఆరంభించారు.ఈ శాన్య భారతం భద్రతకు ఆయనెంతో కృషి చేశారని కొనియాడారు.