తెలంగాణ బిజేపీ ఛీప్ గా ఆయన పేరు ఖరారు..? ఆ దిశగా కమలం పార్టీ అడుగులు..

-

తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలని చూస్తున్న కమలం పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది.. బీసీ నినాదంతో గత ఎన్నికల్లో ప్రచారం చేసిన ఆ పార్టీ.. ఆశించిన సీట్లను సంపాదించుకుంది.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలను తన ఖాతాలో వేసుకుని.. ఈ సారి టార్గెట్ అధికారం అన్నట్లుగా పావులు కదుపుతోంది.. సరైన అవకాశం వస్తే రూలింగ్ లోకి రావాలని చూస్తోంది..

etela rajender

దేశంలో చక్రం తిప్పుతున్న భారతీయ జనతా పార్టీ.. తెలంగాణా మీద ఫోకస్ పెడుతోంది. జమిలి ఎన్నికలకు సిద్దమవుతున్న తరుణంలో దక్షిణాదిన తెలంగాణా మీద ఆశలు పెట్టుకుంది.. ఏపీలో ఎలాగూ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటంతో.. మొదట తెలంగాణలో పాగా వెయ్యాలని ఆ పార్టీ చూస్తోంది.. జమిలి ఎన్నికలు వస్తే.. అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది..

బిజేపీ అధ్యక్షుని కోసం ఈ పార్టీ అన్వేషణ మొదలుపెట్టింది.. ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న కిషన్ రె0డ్డి కేంద్రమంత్రిగా ఉన్నారు.. దీంతో ఆయన రెండు బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహించలేకపోతున్నారు.. అధ్యక్ష పదవి బీసీ నేతకు కట్టబెట్టాలని కిషన్ రెడ్డే కేంద్ర పెద్దలకు చెప్పారట.. దీంతో సరైన నేత కోసం అధిష్టానం చూస్తోంది.. ఈ క్రమంలో ఆ కొత్త వారు ఎవరు అన్నదే చర్చగా ముందుకు వస్తోంది.

మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ వైపు అధిస్టానం చూస్తోందన్న టాక్ వినిపిస్తోంది.. సీనియర్ నేతగా.. తెలంగాణ రాజకీయాలను ఆకలింపు చేసుకున్న నేతగా ఆయన పేరుంది.. రాష్టం ఏర్పడిన తర్వాత తొలి ఆర్దికశాఖామంత్రిగా కూడా పనిచేశారు.క్షేత్రస్థాయికి వెళ్లి కొట్లాడే మనస్తత్వం కల్గిన ఈటెలకు అధ్యక్ష పదవి కట్టబెట్టాలని అధిష్టానం ఆలోచిస్తోందట..

బీఆర్ఎస్ దూకుడును. కాంగ్రెస్ స్పీడ్ ను తట్టుకుని పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అనుభవంతో పాటు.. విసృత పరిచయాలు అవసరం.. రెండు పార్టీలను తట్టుకుని రాజకీయ క్షేత్రంలో నిలబడాలీ అంటే సమర్దవంతమైన నేత అవసరం.. దానికి తోడు బీసీ సామాజికవర్గంలో బలమైన నేతగా ఉండటంతో.. ఆయనతోనే పార్టీ బలోపేతం అవుతుందని కమలం నేతలు స్ట్రాంగ్ గా పిక్సయ్యారట.. రాష్ట నాయకులు కూడా పలువురు ఈటెలకు మద్దతుగా ఉండటంతో.. ఇక ఆయనకు అధ్యక్ష పదవి కట్టబెట్టడం లాంఛనమేనన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news