ఇక గ్యారెంటీలు ప్రకటించకూడదని ఖర్గే ఆదేశాలు ఇచ్చారట. జార్ఖండ్, మహారాష్ట్రలో గ్యారెంటీలు ప్రకటిస్తే.. కాంగ్రెస్ జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారట ఖర్గే. అయితే.. దీనిపై కేటీఆర్ స్పందించారు. గౌరనీయులైన ఖర్గే గారు.. గాలిమాటల గ్యారెంటీలిస్తే.. మొదటికే మోసం వస్తుందని ఇప్పుడు అర్థమైందా..? అంటూ చురకలు అంటించారు.
కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ట్ర బడ్జెట్ గుర్తు రాలేదా? అంటూ ఆగ్రహించారు. బడ్జెట్ చూసుకోకుండా హామీలిస్తే.. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తప్పదని ఇప్పుడు బోధపడిందా..? అంటూ నిప్పులు చెరిగారు. ఆరు గ్యారంటీలతో వల వేసినప్పుడు తెలంగాణ బడ్జెట్ గురించి తెలియదా? అని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఈ తప్పు చేస్తున్నప్పుడు.. ఈ విషయాలు ఎందుకు గుర్తుకురాలేదని ఫైర్ అయ్యారు. ఏవీ చూసుకోకుండా.. కేవలం అధికారమే లక్ష్యంగా.. కాంగ్రెస్ ఆడిన గ్యారెంటీల గారడీతో..తెలంగాణ రాష్ట్రం.. ఏడాదిలోనే ఆగమైందంటూ నిప్పులు చెరిగారు కేటీఆర్.