తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ.. తాజాగా కీలక ప్రకటన చేశారు. కార్తీకమాసం సందర్భంగా మహిళలకు శుభవార్త చెప్పారు కొండ సురేఖ. కార్తీకమాస దీపోత్సవాల్లో పాల్గొనే మహిళలకు 2 మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు, పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీస్‌లు ఇవ్వాలని అధికారులను ఆదేశించిన మంత్రి కొండా సురేఖ… ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
ఇవాల్టి నుంచి కార్తిక మాసం ప్రారంభమైన సంగతి తెలిసిందే. కార్తీక మాసం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. వేలాది మంది భక్తులు శివుని గుడికి వెళ్తున్నారు. శివయ్యను దర్శించుకొని… కార్తీక మాసం పూజలు చేస్తున్నారు.
అయితే కార్తీక మాసం నేపథ్యంలో… మహిళలకు చాలా రకాల అవసరాలు ఉంటాయి. వాటిని తీర్చేందుకు తాజాగా కొండా సురేఖ కీలక ప్రకటన చేశారు. కార్తీకమాస దీపోత్సవాల్లో పాల్గొనే మహిళలకు 2 మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు, పసుపు, కుంకుమ, బ్లౌజ్ పీస్‌లు ఇవ్వాలని అధికారులను ఆదేశించిన మంత్రి కొండా సురేఖ… ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చారు.