ఈనెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

-

ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకూ ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. కనీసం పదిరోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ తో  పాటు ఇతర బిల్లులను కూడా  సభ ముందుకు తీసుకురానుంది.

అయితే ఈ బడ్జెట్ సమావేశాలు దాదాపు 10 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. పలు బిల్లులను కూడా సభలో ప్రవేశ పెట్టనుంది. నవంబర్ నుంచి మార్చి వరకు పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news