2027లో జమిలి ఎన్నికలు వస్తాయని ముందస్తు సమాచారం రావడంతో వచ్చే మూడేళ్లూ దోచుకునే పనిలో సీఎం చంద్రబాబు నిమగ్నం అయ్యారని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే తన కొడుకుని సీఎం చేసే పనిలో చంద్రబాబు సమాలోచనలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ఏదో రకంగా బతికిబట్ట కట్టేందుకు తెలుగుదేశం పార్టీ తాపత్రయపడుతోందన్నారు.
‘2027లో జమిలి ఎన్నికలు’ వస్తాయని ప్రచారం జరుగుతున్నందున ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకోవడంలో టీడీపీ నిమగ్నమైందా? అని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు తమ్ముళ్ల దందాలు, దోపిడీలు, మోసాలు, హత్యలు, రేప్‌లు చూసి టీడీపీకి ఎందుకు ఓటు వేశామా? అని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.