నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ట్రంప్, కమలా హారిస్ మధ్య హోరాహోరీ ఉంటుంది. స్వింగ్ స్టేట్స్పై అభ్యర్థులు చివరి ఫోకస్ పెట్టారు. ఈ తరుణంలోనే… వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం పెన్సిల్వేనియాలోని సెటిలర్ ప్రాంతాలలో ఓటర్లకు తమ ముగింపు సందేశాలను అందించారు.
ఇది ఇలా ఉండగా 1989 సంవత్సరంలో జార్జ్ వాషింగ్టన్… అమెరికా తొలి అధ్యక్షుడిగా ప్రమాణం చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా 45 మంది అధ్యక్షులు అమెరికాకు పని చేశారు. ప్రస్తుతం ఉన్న జాబ్ ఐడెం 46వ అధ్యక్షుడు కావడం విశేషం. ఇప్పుడు 47వ.. అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. అమెరికా రాజకీయ చరిత్రలో ఏ పార్టీకి కూడా ప్రాతినిధ్యం వహించిన ఏక అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ కావడం విశేషం. ఆయనే తొలి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ట్రంప్ వర్సెస్… కమలహారిస్ మధ్య పోటీ నెలకొంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ట్రంప్ గెలిచే అవకాశాలు స్పష్టంగా… కనిపిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.